తండ్రీకొడుకులుగా రవితేజ ద్విపాత్రాభినయం
Advertisement
'రాజా ది గ్రేట్' తరువాత రెండు సినిమాలు పరాజయంపాలు కావడంతో, ఈసారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో రవితేజ వున్నాడు. ఆయన తాజా చిత్రంగా శ్రీను వైట్ల దర్శకత్వంలో 'అమర్ అక్బర్ ఆంటోని' రూపొందుతోంది. మూడు డిఫరెంట్ లుక్స్ తో ఈ సినిమాలో రవితేజ కనిపించనున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన మరో ప్రాజెక్టును ఓకే చేసినట్టుగా తెలుస్తోంది.

ఈ సినిమాకి వీఐ ఆనంద్ దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. ఈ సినిమాలో తండ్రీకొడుకులుగా రవితేజ ద్విపాత్రాభినయం చేయనున్నట్టు చెబుతున్నారు. ఇంతకుముందు రవితేజతో 'నేల టిక్కెట్టు ' నిర్మించిన రామ్ తాళ్లూరి, ఆ సినిమా ప్లాప్ అయినా ఈ సినిమాను నిర్మించనుండటం విశేషం. 'ఒక్క క్షణం' పరాజయం తరువాత వీఐ ఆనంద్ చేస్తోన్న ఈ సినిమా, త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.  
Wed, Sep 05, 2018, 04:54 PM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View