'నాకు పోటీ వస్తున్నారా?' అని రావు గోపాలరావుగారు అడిగారు: పరుచూరి గోపాలకృష్ణ
Advertisement
తాజాగా 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో రావు గోపాలరావుతో తనకి గల అనుబంధం గురించి పరుచూరి గోపాలకృష్ణ ప్రస్తావించారు. "బలగం పూడి సీతయ్య పాత్రను నేను వేసినప్పుడు ఫస్టు నన్ను అభినందించింది రావు గోపాలరావు. "ఏంటి నాకు పోటీ వచ్చేస్తున్నారా?" అంటూ నవ్వుతూ అడిగారు.

 'లేదండీ .. గోపాల్ గారు .. నాయుడు గారు అడిగితే చేశాను. మాకు రాసుకోవడానికే టైము చాలట్లేదు .. వేషాలు ఎక్కడ వేస్తాను. అయినా మీలా మేమెక్కడ చేయగలం గురువు గారు' అన్నాను. రావు గోపాలరావు ప్రతి పాత్రలోను ఒదిగిపోయి జీవం పోసేవారు. డైరెక్టర్లకు .. రైటర్లకు ఎస్వీ రంగారావుగారు అంటే ఎంతభయమో .. రావు గోపాలరావుగారు అంటే అంత భయం ఉండేది. నన్ను 'కవి రాక్షస' అని ఆయన ముద్దుగా పిలిచేవారు. షుగర్ వ్యాధి ఆయనను తీసుకెళ్లకుండా వుండివుంటే, ఆయన మరిన్ని మంచి పాత్రలు చేసేవారు" అంటూ చెప్పుకొచ్చారు.  
Wed, Sep 05, 2018, 04:18 PM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View