ముందస్తు ఎన్నికలు.. 15 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్న కేసీఆర్
05-09-2018 Wed 15:51
- కాసేపట్లో ఫామ్ హౌస్ నుంచి ప్రగతి భవన్ చేరుకోనున్న కేసీఆర్
- ఉద్యోగసంఘాలతో భేటీ అయి.. మధ్యంతర భృతి ప్రకటన
- రేపు అసెంబ్లీ రద్దుకు సిఫార్సు

అసెంబ్లీ రద్దు, ముందస్తు ఎన్నికల గురించి పార్టీ కీలక నేతలతో తన ఫామ్ హౌస్ లో చర్చోపచర్చలు సాగించిన ముఖ్యమంత్రి కేసీఆర్... కాసేపట్లో ఫామ్ హౌస్ నుంచి హైదరాబాదులోని ప్రగతి భవన్ కు చేరుకోనున్నారు. అనంతరం ఉద్యోగ సంఘాలతో భేటీ అయి... మధ్యంతర భృతిని ప్రకటించనున్నారు. అసెంబ్లీ రద్దుకు సంబంధించి రేపు కేబినెట్ భేటీ జరగనుంది. అనంతరం గవర్నర్ ను కలసి అసెంబ్లీని రద్దు చేయాలని కోరనున్నారు. ఎల్లుండి హుస్నాబాద్ సభ వేదికగా ఎన్నికల ప్రచారపర్వాన్ని ప్రారంభించనున్నారు. ప్రజాఆశీర్వాద సభల పేరుతో 50 రోజుల్లో 100 నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. అంతేకాదు, హుస్నాబాద్ సభావేదిక నుంచి 15 మంది అభ్యర్థులను ఆయన ప్రకటించనున్నట్టు తెలుస్తోంది.
More Latest News
రష్యా సైనికులను వణికించిన మేక
4 minutes ago

ఈసారి చంద్రబాబు మాట కూడా వినం... వైసీపీ వాళ్ల వీపులు పగలడం ఖాయం: ప్రత్తిపాటి పుల్లారావు
7 minutes ago

శ్రీకాకుళంలో అమ్మ ఒడి నిధులు విడుదల చేసిన సీఎం జగన్
21 minutes ago

ప్రకృతి విరుద్ధమైన బంధం వద్దన్నారని లింగమార్పిడి
37 minutes ago

రామ్చరణ్-శంకర్ సినిమాకు టైటిల్ ఇదేనా!
41 minutes ago

శివసేనకు మరో షాక్.. సంజయ్ రౌత్ కు ఈడీ సమన్లు
52 minutes ago
