ఇంతకుమించి చెప్పొద్దని మహేశ్ నాకు వార్నింగ్ ఇచ్చాడు!: అల్లరి నరేశ్
Advertisement
మహేశ్ బాబు 25వ మూవీగా 'మహర్షి' రూపొందుతోంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో, అల్లరి నరేశ్ ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడు. తాజా ఇంటర్వ్యూలో ఈ సినిమాకి సంబంధించిన ప్రశ్నలు అల్లరి నరేశ్ కి ఎదురయ్యాయి. "ఈ సినిమాలో మహేశ్ కి పేదవాడైన ఒక స్నేహితుడిగా చేస్తున్నారట నిజమేనా?" అని అడగడంతో ఆయన తనదైన శైలిలో స్పందించాడు.

'గమ్యం'లో నేను చేసిన 'గాలి శీను' పాత్ర అందరికీ ఎంతగానో కనెక్ట్ అయింది .. ఈ పాత్ర కూడా అలాంటిదే. ఈ సినిమా కోసం ఇప్పటికే మహేశ్ బాబుతో కలిసి 45 రోజుల పాటు ప్రయాణం చేశాను. మరో 100 రోజుల పాటు ఆయనతో కలిసి జర్నీ చేయవలసి ఉంటుంది. అక్టోబర్ నుంచి మళ్లీ షూటింగులో జాయిన్ అవుతాను. ఇంతకు మించి ఏమీ చెప్పొద్దని ఆల్రెడీ నాకు మహేశ్ బాబు వార్నింగ్ ఇచ్చాడు" అంటూ నవ్వేశాడు.    
Wed, Sep 05, 2018, 03:49 PM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View