మొదట్లో వేషాల కోసం రావు రమేశ్ మా దగ్గరికి వచ్చాడు: పరుచూరి గోపాలకృష్ణ
Advertisement
తెలుగు సినిమా చరిత్రలో ఎన్నో సినిమాలు విజయవిహారం చేయడంలో పరుచూరి బ్రదర్స్ ప్రధానమైన పాత్రను పోషించారు. అలాంటి పరుచూరి బ్రదర్స్ లో ఒకరైన పరుచూరి గోపాలకృష్ణ, ఈ వారం 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో రావు గోపాలరావు గురించి ప్రస్తావించారు. "రావు గోపాలరావు చనిపోయిన తరువాత కొంత కాలానికి రావు రమేశ్ ను వెంటబెట్టుకుని, వాళ్లమ్మ గారు మా ఇంటికి వచ్చారు.

'బాబుకి ఏమైనా వేషాలు చెప్పండి' అని వాళ్లమ్మ గారు అన్నారు. ఆ మాట వినగానే నా కళ్లలో నీళ్లు తిరిగాయి. రావు రమేశ్ గురించి చాలామందికి చెప్పాము .. కానీ ఎవరూ పట్టించుకోలేదు. ఆయనను 'గమ్యం' సినిమాలో తెరపై చూసినప్పుడు 'ఇంతమంచి నటుడిని గురించి చెబితే మీరెవరూ అర్థం చేసుకోలేదు' అని పెద్దగా అరవాలనిపించింది. ఈ రోజున .. ఆయన లేని సినిమా లేదు. ఇండస్ట్రీ ఎలా ఉంటుందంటే మనం చెబుతుంటే అదేదో రికమండేషన్ అనుకుంటారు. మా దగ్గరికి వచ్చినప్పుడే నేను అన్నాను .. నువ్ మీ నాన్న అంతటి నటుడివి అవుతావని .. అలాగే జరిగింది" అని చెప్పుకొచ్చారు .    
Wed, Sep 05, 2018, 03:08 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View