ప్రభాస్ తో జాయినైన వెన్నెల కిషోర్
Advertisement
ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో 'సాహో' చకచకా షూటింగు జరుపుకుంటోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ .. రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. కొన్ని రోజులుగా ప్రభాస్ తదితరులపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తూ వచ్చారు. తాజాగా ఈ షెడ్యూల్లో వెన్నెల కిషోర్ జాయిన్ అయ్యాడు.

వెన్నెల కిషోర్ టాలీవుడ్లో స్టార్ కమెడియన్ గా కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. 'సాహో'లో ప్రభాస్ .. వెన్నెల కిషోర్ కాంబినేషన్లో మంచి కామెడీ సీన్స్ వున్నాయట. ఈ సీన్స్ లో మురళీశర్మ కూడా నవ్వించనున్నాడు. ఈ ముగ్గురి కాంబినేషన్లోని సన్నివేశాలను ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు. ఈ కామెడీ సీన్స్ ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తాయని చెబుతున్నారు. ఈ నెలాఖరుకి ఈ షెడ్యూల్ ముగియనుంది. శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను వచ్చే వేసవిలో విడుదల చేయనున్నారు. 
Wed, Sep 05, 2018, 02:47 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View