నేపాల్ లో శర్వానంద్, సాయిపల్లవి షూటింగ్!
Advertisement
Advertisement
హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్ .. సాయిపల్లవి జంటగా 'పడి పడి లేచె మనసు' సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణ జరుపుకుంది. ఇటీవల కోల్ కతాలో 70 రోజుల పాటు జరిగిన షెడ్యూల్లో చాలా కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ఆ తరువాత షెడ్యూల్ ను నేపాల్ లో నిర్వహిస్తున్నారు. నాలుగు రోజులుగా నేపాల్ లో నాయకా నాయికలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మరికొన్ని రోజుల పాటు అక్కడ కొనసాగే షెడ్యూల్ తో ఈ సినిమా షూటింగు పార్టు పూర్తికానుంది. ఈ రొమాంటిక్ లవ్ స్టోరీలో ఫుట్ బాల్ ప్లేయర్ గా శర్వానంద్ .. డాక్టర్ గా సాయిపల్లవి నటిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణగా నిలవనుందని అంటున్నారు.          
Wed, Sep 05, 2018, 02:00 PM
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View