పిల్లలు పుట్టడం లేదని వర్ధమాన తమిళ నటుడి భార్య ఆత్మహత్య!
Advertisement
వివాహమై ఎంత కాలమైనా పిల్లలు పుట్టడం లేదన్న మనస్తాపంతో ఓ నటుడి భార్య ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు వెల్లడించిన మరింత సమాచారం ప్రకారం, 'యాగవరాయనుమ్', 'నాకాక్క' తదితర చిత్రాల్లో నటించిన సిద్ధార్థ్, స్మిరిజ దంపతులు. వీరికి వివాహమై మూడు సంవత్సరాలు గడిచినా పిల్లలు పుట్టలేదు. పిల్లల విషయంలో లోపం నీలో ఉందంటే, నీలో ఉందంటూ, ఇద్దరూ తరచూ గొడవ పడుతుండేవారు.

 ఈ క్రమంలో సోమవారం రాత్రి తన భార్యను తీసుకుని హోటల్ కు వెళ్లి భోజనం చేసి వచ్చిన సిద్ధార్థ్, ఇంటికి వచ్చిన తరువాత ఆమెతో మరోసారి గొడవపడ్డాడు. సిర్మిజ ఆగ్రహంతో తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకోగా, సిద్ధార్థ్ బయట హాలులో పడుకున్నాడు. మంగళవారం ఉదయం 8.30 గంటలైనా భార్య బయటకు రాకపోవడంతో తలుపులు తట్టాడు. లోపలి నుంచి సమాధానం లేకపోవడంతో మధురవాయిల్ పోలీసులకు సమాచారాన్ని అందించాడు.

పోలీసులు వచ్చి తలుపులు పగులగొట్టగా, లోపల ఫ్యాన్ కు ఉరేసుకున్న సిర్మిజా కనిపించింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, పోస్టుమార్టం నిమిత్తం ఆమె మృతదేహాన్ని కీల్ పాక్కం హాస్పిటల్ కు తరలించారు. కేసును విచారిస్తున్నామని తెలిపారు.
Wed, Sep 05, 2018, 10:04 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View