మరింత పతనమైన రూపాయి విలువ.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
Advertisement
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాలను మూటగట్టుకున్నాయి. ఐటీ మినహా మిగిలిన సూచీలన్నీ నష్టపోయాయి. అమెరికా డాలరు మారకంతో భారత రూపాయి విలువ రూ. 71.54కు పడిపోవడం మార్కెట్లపై ప్రభావాన్ని చూపింది. డాలర్ మరింత బలపడటంతో, ఐటీ కంపెనీల షేర్లు లాభాలను నమోదు చేశాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 155 పాయింట్లు కోల్పోయి 38,158కి పడిపోయింది. నిఫ్టీ 62 పాయింట్లు నష్టపోయి 11,520 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ (5.01%), క్వాలిటీ (4.78%), లక్ష్మి విలాస్ బ్యాంక్ (3.08%), ఫీనిక్స్ మిల్స్ (2.83%), జుబిలెంట్ లైఫ్ సైన్సెస్ (2.72%).  
   
టాప్ లూజర్స్:
ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (-8.89%), నెట్ వర్క్ 18 మీడియా (-7.89%), ఎన్సీసీ (-7.82%), ఐనాక్స్ లీజర్ (-7.72%), రిలయన్స్ పవర్ (-7.54%).  
Tue, Sep 04, 2018, 04:31 PM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View