అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పనున్న ఇంగ్లాండు ఆటగాడు అలెస్టర్ కుక్!
Advertisement
అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై  చెప్పనున్నట్టు ఇంగ్లాండు జట్టు మాజీ కెప్టెన్ అలెస్టర్ కుక్ ప్రకటించాడు. భారత్ తో జరిగే ఐదో టెస్టు మ్యాచ్ అనంతరం తాను తప్పుకుంటానని పేర్కొన్కాడు. ఈ సందర్భంగా కుక్ మాట్లాడుతూ, భారత్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ ముగిసిన తర్వాత తాను అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అవుతానని చెప్పాడు.

 ఇకపై జట్టు సభ్యులతో కలిసి డ్రెస్సింగ్ రూమ్ ని పంచుకోలేననే విషయం బాధగానే ఉన్నప్పటికీ, ఇందుకు ఇదే తగిన సమయమని చెప్పాడు. భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకుని, యువ క్రీడాకారులకు మరిన్ని అవకాశాలు దక్కాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకుంటున్నానని అన్నాడు. తమ దేశం తరపున ఇంతకాలం తాను ఆడటం ఎంతో సంతోషంగా, గౌరవంగా ఉందని కుక్ చెప్పాడు.  
Mon, Sep 03, 2018, 09:37 PM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View