టీమిండియా విజయలక్ష్యం 245 పరుగులు.. ఆదిలోనే ఇండియాకు ఎదురుదెబ్బ
Advertisement
ఇంగ్లండ్ తో సౌథాంప్టన్ లో జరుగుతున్న నాలుగో టెస్టు ఆసక్తికరంగా మారింది. రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 271 పరుగులకు ఆలౌట్ అయింది. 69 పరుగులతో బట్లర్ హయ్యెస్ట్ స్కోరర్ గా నిలిచాడు. మరోసారి సత్తా చాటిన షమీ 4 వికెట్లు తీయగా ఇషాంత్ శర్మ 2 వికెట్లు తీశాడు. అశ్విన్, బుమ్రాలు చెరో వికెట్ పడగొట్టారు.

245 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. మంచి ఫామ్ లో ఉన్న ఓపెనర్ కేఎల్ రాహుల్ పరుగులేమీ చేయకుండానే డకౌట్ గా పెవిలియన్ చేరాడు. స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం ధావన్ 9 పరుగులు, పుజారా 3 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత్ స్కోరు వికెట్ నష్టానికి 12 పరుగులు. విజయానికి మరో 233 పరుగులు చేయాల్సి ఉంది.
Sun, Sep 02, 2018, 04:28 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View