నందమూరి కుటుంబాన్ని పరామర్శించిన మహేష్ బాబు!
01-09-2018 Sat 13:49
- మెహదీపట్నంలోని ఇంటికెళ్లిన మహేశ్
- హరి కుటుంబ సభ్యులకు సానుభూతి
- గంటపాటు అక్కడే ఉన్న సూపర్ స్టార్

నటుడు, టీడీపీ సీనియర్ నేత నందమూరి హరికృష్ణ బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. హరికృష్ణ మరణంతో నందమూరి కుటుంబ సభ్యులు, అభిమానులు కన్నీరుమున్నీరు అయ్యారు. తాజాగా సూపర్ స్టార్ మహేశ్ బాబు నందమూరి కుటుంబాన్ని పరామర్శించాడు.
నిన్న హరికృష్ణ నివాసానికి వెళ్లిన మహేశ్.. నందమూరి కుటుంబ సభ్యులను ఓదార్చాడు. హరికృష్ణ మృతి పట్ల సానుభూతి తెలిపాడు. దాదాపు గంటపాటు మహేశ్ అక్కడే ఉన్నాడు. తన అభిమాని వివాహానికి హాజరయ్యేందుకు బుధవారం తెల్లవారుజామున కారులో హరికృష్ణ బయలుదేరిన సంగతి తెలిసిందే. నల్గొండ జిల్లాలో కారు డివైడర్ ను ఢీకొని ప్రమాదానికి గురికావడంతో హరికృష్ణ చనిపోగా, కారులోనే ఉన్న ఇద్దరు మిత్రులు ప్రాణాలతో బయటపడ్డారు.
ADVERTSIEMENT
More Telugu News
మరో ప్రయోగానికి రెడీ అవుతున్న సూర్య!
5 minutes ago

సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న అడివి శేష్ 'మేజర్'
35 minutes ago

హరీశ్ శంకర్ తో రామ్ సినిమా!
45 minutes ago

సముద్ర గర్భంలో పంచదార కొండలు... తాజా అధ్యయనంలో వెల్లడి
52 minutes ago
