ఏషియన్స్ గేమ్స్ లో భారత్ పసిడి ‘పంచ్’.. ఒలింపిక్ విజేతను ఓడించిన పంగల్!
Advertisement
ఇండోనేషియాలో జరుగుతున్న ఏషియన్ గేమ్స్ లో భారత ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. తాజాగా 49 కేజీల బాక్సింగ్ విభాగంలో భారత ఆటగాడు అమిత్ పంగల్ బంగారు పతకాన్ని సాధించాడు. ఈ రోజు జరిగిన పోటీలో ఒలింపిక్ ఛాంపియన్, ఉజ్బెకిస్తాన్ బాక్సర్ హసన్ బోయ్ దుమత్సోవ్ పై 3-2 తేడాతో పంగల్ విజయం సాధించాడు. తాజా విజయంతో భారత్ పతకాల సంఖ్య 66కు చేరుకుంది. ఇందులో 14 స్వర్ణాలు, 23 రజతాలు, 29 కాంస్య పతకాలు ఉన్నాయి.
Sat, Sep 01, 2018, 01:31 PM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View