రెండు రోజుల పాటు అంతర్జాతీయ సరిహద్దులన్నింటినీ మూసివేస్తున్న భూటాన్
Advertisement
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రెండు రోజుల పాటు అంతర్జాతీయ సరిహద్దులన్నింటినీ మూసి వేయాలని భూటాన్ ప్రభుత్వం నిర్ణయించింది. సెప్టెంబర్ 14, 15 తేదీల్లో సరిహద్దులను క్లోజ్ చేస్తామని చీఫ్ ఎలక్షన్ సెక్యూరిటీ కోఆర్డినేటర్ ప్రకటించారు. సెప్టెంబర్ 15వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ప్రజా భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆ దేశ ప్రభుత్వం పలు చర్యలను తీసుకుంటోంది.

ఈ క్రమంలో 10వ తేదీ నుంచే సెక్యూరిటీ తనిఖీలు ఉంటాయని... బయట తిరిగే ప్రతి ఒక్కరూ ఐడెంటిటీ కార్డులను తప్పనిసరిగా ఉంచుకోవాలని హెచ్చరించింది. సెప్టెంబర్ 14వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 15వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు సరిహద్దుల వద్ద ఎలాంటి రాకపోకలు ఉండవని భూటాన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. భారత్ తో భూటాన్ కు పలు అంతర్జాతీయ మార్గాలు ఉన్నాయి.
Fri, Aug 31, 2018, 06:13 PM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View