మైదానంలోనే బట్టలు మార్చుకున్న క్రీడాకారిణి అలైజ్ కార్నెట్!
Advertisement
యూఎస్ ఓపెన్ పోటీలు జరుగుతున్న వేళ, ఫ్రెంచ్ క్రీడాకారిణి అలైజ్ కార్నెట్, మైదానంలో తన బట్టలు మార్చుకోవడం, లోదుస్తులు పైకి కనిపించడంతో చైర్ అంపైర్ తప్పుబట్టడంపై ఇప్పుడు పెను దుమారం చెలరేగుతోంది. డబ్ల్యూటీఏ నిబంధనల ప్రకారం, మహిళలు కోర్టులో దుస్తులు మార్చుకునేందుకు వీలు లేదు. పురుషులకు ఆ నిబంధన ఏమీ లేదు. తాజాగా, కార్నెట్ వ్యవహారం మరోసారి ఈ అంశాన్ని తెరపైకి తేగా, పురుషులకు అడ్డురాని నిబంధనలు మహిళల విషయంలో ఎందుకని మాజీలు ప్రశ్నిస్తున్నారు.

కార్నెట్ తన తొలి మ్యాచ్ ని జొహన్నా లార్సన్ తో ఆడుతున్న వేళ, తన టాప్ ను సరిగ్గా ధరించకుండా కోర్టులోకి వచ్చింది. వెనుకభాగం ముందుకు వచ్చేలా ఆమె టాప్ ధరించగా, బాయ్ ఫ్రెండ్ గుర్తించి సైగ చేశాడు. దీంతో ఆమె మళ్లీ లాకర్ రూములోకి ఎందుకు వెళ్లాలని భావించిందో ఏమో, పదంటే పది సెకన్లలో తన టాప్ ను పైకి తీసి, సరిచేసుకుని ధరించింది. ఆమె చేసిన పనికి చైర్ అంపైర్ వార్నింగ్ ఇచ్చాడు. దీంతో కార్నెట్ కు మద్దతు పలుకుతూ, పలువురు కామెంట్లు చేస్తుండటంతో యూఎస్ ఓపెన్ నిర్వాహకులు, ఆమెకు వార్నింగ్ ఇవ్వకుండా ఉండాల్సిందని ఓ ప్రకటన విడుదల చేయడం గమనార్హం.
Fri, Aug 31, 2018, 10:30 AM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View