మరో ఆరు పరుగులు చేస్తే, సచిన్ రికార్డును బద్దలు కొట్టనున్న విరాట్ కోహ్లీ!
Advertisement
టీమిండియా కెప్టెన్ మరో రికార్డుకు చేరువయ్యాడు. ఇంగ్లండ్ జట్టుతో ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా, నాలుగో టెస్టు జరుగుతున్న వేళ, సచిన్ టెండూల్కర్ మరో రికార్డు బద్దలయ్యే అవకాశం ఉంది.. ఈ మ్యాచ్ లో కోహ్లీ మరో ఆరు పరుగులు చేస్తే, టెస్టుల్లో 6 వేల పరుగుల మైలురాయిని అందుకుంటాడు.

సచిన్ తన కెరీర్ లో 6 వేల పరుగుల మైలురాయిని చేరేందుకు 120 ఇన్నింగ్స్ తీసుకోగా, కోహ్లీకి నేటి మ్యాచ్ 119వ ఇన్నింగ్స్ అవుతుంది. అంటే, నేడు కోహ్లీ బ్యాటింగ్ కు వచ్చి 6 పరుగులు చేస్తే, సచిన్ రికార్డు కనుమరుగవుతుంది. ఇప్పటివరకూ 69 టెస్టులాడిన కోహ్లీ, 118 ఇన్నింగ్స్ లో 5,994 పరుగులు చేశాడు. నేడు కోహ్లీ ఆరు వేల పరుగుల మైలురాయిని చేరుకున్న క్రికెటర్ల జాబితాలో చేరుతాడని అభిమానులు భావిస్తున్నారు.

కాగా, టెస్టుల్లో 6 వేల పరుగులను అత్యంత త్వరగా పూర్తి చేసిన వారిలో సర్ డాన్ బ్రాడ్ మన్ అగ్రస్థానంలో ఉన్నారు. ఆయన కేవలం 68 ఇన్నింగ్స్ లోనే ఈ ఘనత సాధించారు.
Fri, Aug 31, 2018, 08:42 AM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View