నాల్గో టెస్టు.. మొయిన్ అలీ, శామ్ కరణ్ భాగస్వామ్యానికి బ్రేక్!
Advertisement
భారత్ తో జరుగుతున్న నాల్గో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ జట్టు నిలకడగా ఆడుతోంది. సౌథాంప్టన్ లోని రోజ్ బౌల్ గ్రౌండ్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టీ బ్రేక్ అనంతరం.. 60 ఓవర్లు ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. నిలకడగా ఆడుతున్న శామ్ కరన్ 39 పరుగులతో కొనసాగుతున్నాడు. శామ్ కరణ్ కు జతగా ఆదిల్ రషీద్ ఉన్నాడు. అంతకుముందు, మొయిన్ అలీ, శామ్ కరణ్ భాగస్వామ్యం కొనసాగింది. అయితే, మొయిన్ అలీ (40) అవుటవడంతో వీరి భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. వీరిద్దరి భాగస్వామ్యంలో 53 పరుగులు వచ్చాయి.

కాగా, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండు జట్టు 86 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన మొయిన్ అలీ, శామ్ కరన్ లు నిలదొక్కుకున్నారు. దీంతో, వీరి భాగస్వామ్యాన్ని బ్రేక్ చేసేందుకు భారత బౌలర్లు శతవిధాలా ప్రయత్నించి.. చివరకు, మొయిన్ ని అవుట్ చేశారు.
Thu, Aug 30, 2018, 09:30 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View