ఫైనల్లో మరోసారి బోల్తాపడ్డ పీవీ సింధు.. రజతంతో సరిపెట్టుకున్న స్టార్ షట్లర్
Advertisement
ఇండియన్ స్టార్ షట్లర్ పీవీ సింధును ఫైనల్స్ పరాజయాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఆసియా క్రీడల్లో ఈరోజు జరిగిన మహిళల సింగిల్స్ మ్యాచ్ లో సింధు పరాజయం పాలైంది. ప్రపంచ నెంబర్  వన్ తైజూ చేతిలో 13-21, 16-21 తేడాతో ఓడిపోయింది. ఫలితంగా రజత పతకంతో ఆమె సరిపెట్టుకుంది. అయితే, ఆసియా క్రీడల చరిత్రలో ఫైనల్స్ కు చేరిన తొలి షట్లర్ గా సింధు చరిత్రకెక్కింది. 2016 ఒలింపిక్స్ ప్రీక్వార్టర్ ఫైనల్స్ లో తైజును చివరిసారి ఓడించిన సింధు...ఆ తర్వాత ఆమెతో జరిగిన వరుస ఆరు మ్యాచ్ లలో ఓడిపోయింది. 
Tue, Aug 28, 2018, 02:23 PM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View