భారీ బ్యాటరీ కెపాసిటీతో ఒప్పో నుండి కొత్త స్మార్ట్ ఫోన్ విడుదల!
Advertisement
Advertisement
చైనాకు మొబైల్ దిగ్గజం ఒప్పో తక్కువ బడ్జెట్ కే రెండు వేరియంట్ లతో హైఎండ్ ఫీచర్లతో కూడిన స్మార్ట్ ఫోన్ ‘రియల్ మీ 2’ను తాజాగా ఈరోజు భారత మార్కెట్లో విడుదల చేసింది. గతంలో ఈ సిరీస్ లో 'రియల్ మీ 1' విడుదల చేయగా తాజాగా 20% అధిక బ్యాటరీ కెపాసిటీ, అధునాతన క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌ లాంటి పలు ఆకట్టుకునే ఫీచర్ లతో ‘రియల్ మీ 2’ని విడుదల చేశారు. డైమండ్ రెడ్, బ్లాక్, బ్లూ కలర్ వేరియంట్స్ లలో ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది.

ఫోన్ ప్రత్యేకతల విషయానికొస్తే.. 3జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజీ మోడల్ ధర రూ.8,990. అలాగే 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజీ మోడల్ ధర రూ.10990గా ఉంది. వెనక భాగంలో రెండు 13/2 మెగాపిక్సల్ కెమెరాలు, ముందు భాగంలో 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాలతో పాటు 6 అంగుళాల స్క్రీన్, 4230ఎంఏహెచ్ బ్యాట‌రీని ఏర్పాటు చేశారు. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ వాడటం వల్ల బ్యాటరీ సామర్థ్యం ఎక్కువని కంపెనీ పేర్కొంది.

ఈ ఫోన్ ని కొనే వినియోగదారులు హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డుని ఉపయోగించి రూ.750 ఫ్లాట్ డిస్కౌంట్ ని పొందవచ్చు. అలాగే జియో వినియోగదారులకి 120జీబీ అదనపు డేటా, రూ.2200 విలువ గల క్యాష్ బ్యాక్ కూడా వోచర్ల రూపంలో లభిస్తాయి. కాగా, వచ్చే నెల 4 నుండి ఫ్లిప్ కార్ట్ లో ఈ ఫోన్ లు విక్రయమవుతాయని కంపెనీ పేర్కొంది.
Tue, Aug 28, 2018, 02:06 PM
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View