పేటీఎం వైపు బఫెట్ చూపు.. భారీ పెట్టుబడి పెడుతున్న అమెరికా దిగ్గజం!
Advertisement
అమెరికన్ పెట్టుబడి దిగ్గజం, బెర్క్ షైర్ హాతవే సంస్థ అధినేత వారెన్ బఫెట్ భారత డిజిటల్ పేమెంట్ కంపెనీ పేటీఎంలో పెట్టుబడులు పెట్టనున్నారు. పేటీఎం మాతృసంస్థ 'వన్97 కమ్యూనికేషన్స్'లో 3 నుంచి 4 శాతం వాటా కొనేందుకు బఫెట్ యత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. పేటీఎంలో ఇప్పటికే జపాన్ కు చెందిన సాఫ్ట్ బ్యాంక్, చైనాకు చెందిన ఆలీబాబా వంటి దిగ్గజ కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి.

బెర్క్ షైర్ హాతవే పేటీఎంలో రూ.2,200 కోట్ల నుంచి రూ.2,500 కోట్ల మేర పెట్టుబడులు పెట్టే అవకాశముందని భావిస్తున్నారు. తాజాగా ఈ డీల్ సాకారమైతే భారత్ లో బఫెట్ పెట్టుబడి పెట్టిన తొలి ప్రైవేటు కంపెనీగా పేటీఎం నిలవనుంది. ఆయన గతంలో దిగ్గజ టెక్నాలజీ కంపెనీలు ఐబీఎం, యాపిల్ లో పెట్టుబడులు పెట్టారు.
Tue, Aug 28, 2018, 09:30 AM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View