పని మనిషితో ట్రంప్ కు అక్రమ సంతానం!
Advertisement
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాసలీలలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఇప్పటికే పలు లైంగిక ఆరోపణలను ఎదుర్కొంటున్న ట్రంప్ కు... అక్రమ సంతానం కూడా ఉందనే విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ విషయాన్ని ట్రంప్ వరల్డ్ టవర్ మాజీ కాపలాదారుడు ఒకరు వెల్లడించారు.

పెళ్లి చేసుకోకుండానే ఓ పని మనిషితో ట్రంప్ సంబంధం పెట్టుకున్నారని... ట్రంప్ ద్వారా ఆమెకు ఓ బిడ్డ జన్మించిందని డినో సాజుదిన్ అనే కాపలాదారుడు తన న్యాయవాది ద్వారా వెల్లడించాడు. ఈ విషయాన్ని ఎవరితో చెప్పకూడదని అమెరికన్ మీడియా ఇంక్ తో తన క్లయింట్ డినో ఒప్పదం కుదుర్చుకున్నాడని... ఇప్పుడు ఆ ఒప్పందం నుంచి బయటపడ్డాడని సదరు న్యాయవాది తెలిపారు. ఈ అంశంపై వైట్ హౌస్ ఇంతవరకు స్పందించలేదు.
Sun, Aug 26, 2018, 12:35 PM
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View