‘తూచ్.. జపాన్ ఆటగాడు నన్ను తోసేసి గెలిచాడు’ అంటున్న బహ్రెయిన్ ప్లేయర్!
Advertisement
ఇండోనేషియాలో జరుగుతున్న ఏషియన్ గేమ్స్ లో రగడ మొదలైంది. మారథాన్ లో జపాన్ అథ్లెట్ హిరోటో తనను తోసేసి స్వర్ణం గెలుచుకున్నాడని  బహ్రెయిన్ కు చెందిన ఎహసాన్ ఎలబాసి ఆరోపించాడు. రేసు చివరిలో తాను లీడింగ్ లోకి వెళ్లే సమయంలో ఈ ఘటన చోటుచేసుకుందని ఎలబాసి తెలిపాడు.

రేసు పూర్తయిన తర్వాత ఎలబాసి మాట్లాడుతూ.. ‘అగ్రస్థానంలో నిలిచిన ఆటగాడు (హిరోటో) నన్ను తోసేశాడు’ అని ఆరోపించాడు. ఈ వ్యవహారంలో బహ్రెయిన్ కోచ్ కిలోంజో కూడా ఎలబాసికి మద్దతుగా నిలిచాడు. తమ ఆటగాడు రేస్ లో తొలిస్థానంలోకి వచ్చే సమయంలో హిరోటో పక్కకు తోసేశాడన్నారు. అతను కావాలనే అలా చేశాడని కిలోంజో వ్యాఖ్యానించారు.

కాగా, ఈ వ్యవహారంపై హిరోటో స్పందించాడు. రేస్ చివర్లో ఏం జరిగిందో తనకు తెలియదనీ, తాను విజేతగా నిలవడం ఆశ్చర్యంగా ఉందని చెప్పాడు. అసలు రేస్ మధ్యలో ఏం జరిగిందో తనకు అర్థం కాలేదని వ్యాఖ్యానించాడు.
Sun, Aug 26, 2018, 10:15 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View