డైరెక్టర్ పదవికి అనిల్ అంబానీ రాజీనామా... తక్షణం అమల్లోకి!
Advertisement
దేశంలోని అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ షిప్ బిల్డింగ్ సంస్థ ఆర్ నావల్ (రిలయన్స్ నావల్ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్) డైరెక్టరు పదవికి అనిల్ అంబానీ రాజీనామా చేశారు. ఈ రాజీనామా వెంటనే అమల్లోకి వచ్చిందని ఆర్ నావల్ పేరిట ఓ ప్రకటన వెలువడింది.

2013 కంపెనీల చట్టం, సెక్షన్ 165 కింద, స్టాక్ మార్కెట్లో లిస్టయిన కంపెనీల్లో పది కంపెనీలకు మాత్రమే ఓ వ్యక్తి డైరెక్టర్ గా ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు తాను డైరెక్టర్ గా ఉన్న కంపెనీల సంఖ్య 10కన్నా ఎక్కువగా ఉండటంతో అనిల్ అంబానీ ఈ నిర్ణయం తీసుకున్నారు. అనిల్ అంబానీ రాజీనామాకు కారణం కంపెనీల చట్టం నిబంధనలేనని సంస్థ ఈ ప్రకటనలో తెలిపింది.
Sun, Aug 26, 2018, 09:54 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View