వీసా నిబంధనలపై గళమెత్తిన అమెరికన్ కంపెనీలు.. అధ్యక్షుడికి లేఖ!
Advertisement
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ విధానాలపై ఆ దేశంలోని ప్రముఖ కంపెనీల సీఈఓలు మండిపడ్డారు. ప్రతిభకు పరిమితులు విధించడం, వీసా జారీ నిబంధనలను కఠినతరం చేయడాన్ని తప్పుబట్టారు. ఈ నిర్ణయాలు ఆర్థిక వ్యవస్థకు గుదిబండగా మారి నష్టం కలిగిస్తాయని హెచ్చరించారు. అధ్యక్షుడు అస్పష్ట, అనూహ్య వీసా నిబంధనల నిర్ణయం నేపథ్యంలో అమెరికాలోని అతిపెద్ద కంపెనీల సీఈఓలు సమావేశమై చర్చించారు.

ప్రభుత్వ విధానాలను తప్పుబడుతూ తాము చర్చించిన అంశాలు, సూచనలతో హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం సెక్రటరీ క్రిస్ట్‌జెన్‌ నీల్సన్‌కు లేఖ రాశారు. ఈ లేఖపై యాపిల్‌, జేపీ మోర్గాన్‌, కోకా కోలా, ఐబీఎం, మారియట్‌ సీఈఓలు టిమ్‌ కుక్‌, జామీ డిమోన్‌, జేమ్స్‌ క్విన్సే, జిన్ని రొమెట్టీ, ఆర్నెసొరెన్సన్‌ సంతకాలు చేశారు. ‘ఉద్యోగుల కొరతతో కంపెనీల్లో ఖాళీలు గరిష్ట స్థాయికి చేరిన స్థితిలో ప్రతిభకు పరిమితులు విధించడం ఎంతవరకు సమంజసం? వీసాల జారీ అంశంలో నిబంధలను సరళతరం చేయకుంటే ఆర్థిక వ్యవస్థకే నష్టదాయకం’ అని తమ లేఖలో పేర్కొన్నారు.
Sat, Aug 25, 2018, 01:15 PM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View