చైనాలోని రిసార్ట్స్‌ హోటల్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 18 మంది మృతి
Advertisement
చైనాలో ఈ రోజు ఉదయం చోటు చేసుకున్న అగ్నిప్రమాదంలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. హార్బిన్‌ నగరంలోని సన్‌ ఐల్యాండ్‌ రిసార్ట్స్‌ ప్రాంతంలోని బెయ్లాంగ్‌ హాట్‌ స్ప్రింగ్‌ హోటల్‌లో ఈ తెల్లవారు జామున (అక్కడి స్థానిక సమయం ) 4.30 గంటల సమయంలో ఈ ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది.

తొలుత నాలుగో అంతస్తులో ప్రారంభమైన మంటలు కాసేపటికి భవనం అంతటికీ వ్యాపించాయి. దీంతో 18 మంది సజీవ దహనం కాగా, 16 మందిని అగ్నిమాపక సిబ్బంది రక్షించి ఆస్పత్రికి తరలించారు. 30 అగ్నిమాపక శకటాలతో సుమారు వంద మంది సిబ్బంది మూడుగంటల పాటు శ్రమించి మంటల్ని అదుపులోకి తెచ్చారు. ప్రమాదానికి కారణాలు ఇంకా వెల్లడి కాలేదు.  
Sat, Aug 25, 2018, 01:09 PM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View