నంబర్ 1 బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ పేరున మరో అరుదైన రికార్డు!
Advertisement
ప్రస్తుతం క్రికెట్ లో భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ టైమ్ నడుస్తోంది. ఇప్పటికే టెస్టుల్లో బ్యాట్స్ మెన్ విభాగంలో నంబర్ వన్ ర్యాంకును సొంతం చేసుకున్న విరాట్.. తాజాగా మరో అరుదైన ఘనతను సాధించాడు. జట్టు కెప్టెన్ గా 200 అంతకంటే ఎక్కువగా రన్స్ చేసి ఏడుసార్లు జట్టును గెలిపించిన తొలి కెప్టెన్ గా విరాట్ చరిత్ర  సృష్టించాడు. గతంలో ఆస్ట్రేలియా జట్టు మాజీ కెప్టెన్లు బ్రాడ్ మన్, రికీ పాంటింగ్ లు మాత్రమే ఆరు టెస్ట్ మ్యాచుల్లో 200 అంతకంటే ఎక్కువ పరుగులు చేసి తమ జట్లను విజయ తీరాలకు చేర్చారు.

మరోవైపు ఆల్ టైం గ్రేట్ టెస్ట్ క్రికెటర్ల జాబితాలో మాత్రం కోహ్లీ 11వ స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో ఆస్ట్రేలియన్ క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్ మన్ 961 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ లో జరుగుతున్న ఐదు మ్యాచుల టెస్ట్ సిరీస్ లో ఆతిథ్య జట్టు 2-1 తో ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే.
Fri, Aug 24, 2018, 03:02 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View