జాదవ్‌ విషయంలో మా నిర్ణయం సరైనదే : పాక్ మంత్రి మహ్మద్‌ ఖురేషీ
Advertisement
పాకిస్తాన్‌ జైల్లో ఉన్న భారత్‌ జాతీయుడు కుల్‌భూషణ్‌ జాదవ్‌ (47) గూఢచర్యం కేసులో పాకిస్తాన్‌ నిర్ణయం సరైనదేనని, అతనికి వ్యతిరేకంగా తమవద్ద బలమైన సాక్ష్యాలు ఉన్నాయని పాకిస్తాన్‌ నూతన విదేశాంగ శాఖ మంత్రి షా మహ్మద్‌ ఖురేషీ తెలిపారు. గూఢచర్యం ఆరోపణలతో జాదవ్‌ను పాకిస్తాన్‌ నిర్బంధించిన విషయం తెలిసిందే. ఇతనికి పాకిస్తాన్‌ మిలటరీ కోర్టు గత ఏడాది ఏప్రిల్‌ 4న ఉరిశిక్ష విధించింది.

ఈ తీర్పును సవాల్‌ చేస్తూ భారత్‌ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించగా కోర్టు తీర్పును పెండింగ్‌లో పెట్టింది. ఈ అంశంపై ఖురేషీ గురువారం మాట్లాడుతూ తమవద్ద బలమైన ఆధారాలున్నందున అంతర్జాతీయ న్యాయస్థానంలో విజయం సాధిస్తామని చెప్పారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వారంపాటు ఈ కేసుపై విచారణ జరగనుందని పాక్‌ మీడియా కథనం. కాగా, చర్చల ద్వారానే కశ్మీర్‌ సమస్యను పరిష్కరించుకోవాలని భావిస్తున్నట్టు ఖురేషీ తెలిపారు. 
Fri, Aug 24, 2018, 10:43 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View