అమెరికా, చైనా ఢీ అంటే ఢీ.. మళ్లీ మొదలైన వాణిజ్య యుద్ధం!
Advertisement
అమెరికా, చైనాలు విశ్వ విపణిలో ఢీ అంటే ఢీ అంటున్నాయి. సుంకాల విధింపుతో ఒకరిపై ఒకరు ఆధిపత్యం సాధించేందుకు ప్రయత్నిస్తున్నాయి. చెరో 16 బిలియన్‌ డాలర్ల వ్యాపారంపై 25 శాతం మేరకు సుంకాల అమలుకు సిద్ధం కావడంతో ఇరుదేశాల మధ్య వాణిజ్య అనిశ్చితి పెరుగుతోంది. చైనాకు చెందిన 16 బిలియన్‌ డాలర్ల విలువైన 279 చైనా వస్తువులపై 25 శాతం సుంకాలను వసూలు చేయనున్నట్లు యూఎస్‌ కస్టమ్స్‌ అండ్‌ బోర్డర్‌ ప్రొటెక్షన్‌ తన వెబ్‌సైట్‌లో గురువారం పేర్కొంది.

 వెంటనే చైనా కూడా అదే విలువైన అమెరికా వస్తువులపై గురువారం నుంచి సుంకాలు  విధిస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం. దీని ప్రభావం అంతర్జాతీయ ఆర్థిక వృద్ధిపై ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. ఇరుదేశాల మధ్య చర్చ జరుగుతుండగానే నెలకొన్న ఈ పరిణామాలు మార్కెట్‌ను వేడెక్కిస్తున్నాయి. గత జూన్‌లో అమెరికా వాణిజ్య మంత్రి, చైనా ఆర్థిక సలహాదారు బీజింగ్‌లో చర్చలు జరిపిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంచితే, ఈ రెండు దేశాల వాణిజ్య యుద్ధంతో స్టాక్ మార్కెట్లు మాత్రం గణనీయంగా ప్రభావం అవుతున్నాయి.
Fri, Aug 24, 2018, 09:46 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View