నన్ను తొలగించాలని చూస్తే అంతా చిక్కుల్లో పడిపోతారు.. జాగ్రత్త!: ట్రంప్ హెచ్చరిక
Advertisement
  తనను అధ్యక్ష పదవి నుండి తప్పిస్తే అమెరికా మార్కెట్ మొత్తం కుప్పకూలిపోతుందని, అమెరికా ఆర్థిక వ్యవస్థ దెబ్బ తింటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఎన్నికల సమయంలో అమెరికా ప్రచార చట్టాలను ఉల్లంఘించిన కేసులో ట్రంప్ పర్సనల్ లాయర్ మైఖేల్ కోహెన్ కోర్టులో, ట్రంప్ కోసమే ఇద్దరు మహిళల్ని డబ్బుతో ప్రభావితం చేశానని చెప్పారు. అంతే కాక ట్రంప్ కు, వారికి వ్యక్తిగత సంబంధం వుందని చెప్పి ఆయన సూచన మేరకే ఓ పోర్న్ స్టార్, మరో మోడల్‌కు తాను డబ్బులు ఇచ్చినట్లు చెప్పారు.

దీంతో ట్రంప్ ను పదవి నుండి తొలగించాలంటూ అభిశంసన తీర్మానం పెట్టాలనే యోచనలో అక్కడి డెమొక్రాట్స్ వున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన చెబుతూ, తనపై ఉన్న సెక్స్ స్కాండల్ ను అడ్డుపెట్టుకుని తనను తొలగించాలని చూడటం అందర్నీ చిక్కుల్లో పడేస్తుందని, ఊహించని ఫలితాలను చవిచూడాల్సి వస్తుందని ట్రంప్ ఫ్యాక్ట్స్ అండ్ ఫ్రెండ్స్ అనే కార్యక్రమంలో చెప్పారు. తాను అధ్యక్షుడిగా ఎన్నో గొప్ప పనులు చేశానని, అలాంటప్పుడు తనను ఎలా అభిశంసించాలనిపిస్తోంది? అని ప్రశ్నించిన ట్రంప్, అంతే స్థాయిలో సీరియస్ గా వార్నింగ్ కూడా ఇచ్చారు.
Thu, Aug 23, 2018, 09:08 PM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View