ఇమ్రాన్ కు మరో పరీక్ష... పాకిస్తాన్‌ అధ్యక్ష ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థి!
Advertisement
పాకిస్తాన్‌ అధ్యక్ష ఎన్నికల్లో పీటీఐకి గట్టి పోటీ ఎదురయ్యేలా ఉంది. విపక్షాలకు చెందిన పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీ (పీపీపీ), పాకిస్తాన్‌ ముస్లింలీగ్‌-నవాజ్‌ (పీఎంఎల్‌-ఎన్‌)లు ఉమ్మడి అభ్యర్థిని నిలపాలని నిర్ణయించినట్లు పాకిస్తాన్‌ మీడియా కథనం. సెప్టెంబర్‌ 4న జరిగే అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి తమ అభ్యర్థిని ఈ నెల 25న ముర్రేలో జరిగే ప్రతిపక్ష పార్టీ సమావేశంలో ప్రకటించే అవకాశం ఉందని పేర్కొంది.

  ప్రముఖ డెంటిస్ట్‌ ఆరీఫ్‌ ఆల్వీ(69)ని పీటీఐ ఇప్పటికే తమ అభ్యర్థిగా ప్రకటించింది. ఇత్‌జాజ్‌ అహసన్‌ను విపక్ష అభ్యర్థిగా పీపీపీ తొలుత ప్రకటించినప్పటికీ, పీఎంఎల్‌-ఎన్‌ అందుకు అంగీకరించలేదు. ప్రస్తుతం జైలు జీవితాన్ని అనుభవిస్తున్న షరీఫ్‌, ఆయన భార్య కుల్సుమ్‌కు వ్యతిరేకంగా అహసన్‌ వ్యాఖ్యలు చేశారంటూ అభ్యంతరం వ్యక్తం చేసింది. విపక్షాలు ఉమ్మడి అభ్యర్థిని నిలిపితే ఎన్నిక రసవత్తరంగా మారుతుంది. అధికార, విపక్షాల మధ్య 8-10 ఓట్ల తేడా వుండడమే ఇందుకు కారణం. పరోస్ఖ పద్ధతిలో పాకిస్తాన్‌ అధ్యక్ష ఎన్నికల్లో పార్లమెంటు, నాలుగు రాష్ట్రాల (ప్రావిన్స్ లు) అసెంబ్లీ సభ్యులు పాల్గొంటారు. ప్రస్తుత అధ్యక్షుడు మమ్మూన్‌ హుస్సేన్‌ పదవీ కాలం సెప్టెంబర్‌ 9తో ముగియనుంది.


Thu, Aug 23, 2018, 12:46 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View