ఇన్ని సూదులు వాడితే పుట్టాడు మరి... గుండెను పిండేసేలా కనిపిస్తున్న ఫొటో వెనకున్న కథ!
Advertisement
ఇక్కడ ఉన్న ఫొటోను చూశారుగా... చుట్టూ వేల కొద్దీ సూదులు. మధ్యలో అమాయకంగా ఉన్న ఓ బేబీ. హార్ట్ సింబల్ లా సిరంజీలను చుట్టూ అమర్చి తీసిన ఫొటో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతూ, గుండెలను టచ్ చేస్తోంది. ఆ బేబీకి, హార్ట్ సింబల్ కు, సిరంజీలకు ఉన్న సంబంధమేంటో తెలుసుకుంటే...

పాట్రీసియా నీల్, కింబెర్లీ అనే ఇద్దరు మహిళలు పెళ్లి చేసుకున్నారు. తమకు ఓ బిడ్డ కావాలని ఐయూఐ (ఇంట్రా యూటిరైన్ ఇన్‌సెమినేషన్) పద్ధతిని ఎంచుకున్నారు. ఇది కూడా సరోగసీ వంటి ఓ పద్ధతే. అది ఫెయిల్ కావడంతో ఐవీఎఫ్ (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) పద్ధతిని ఎంచుకుని నాలుగేళ్ల పాటు ప్రయత్నించారు. ఎన్నోమార్లు ఐవీఎఫ్ కూడా విఫలమైంది.

 దాదాపు నాలుగేళ్ల తరువాత వారి ప్రయత్నం ఫలించగా, పాట్రీసియా నెల తప్పింది. కడుపులోని పిండం పరిస్థితి బాగాలేదని వైద్యులు తేల్చగా, దినదిన గండంగా గడుపుతూ, 9 నెలల పాటు గర్భాన్ని మోసి, ఈ బిడ్డను కంది. ఆపై ఐయూఐ, ఐవీఎఫ్ విధానాల్లో తాము వాడిన సిరంజీలను ఇలా పేర్చి, మధ్యలో తమ బిడ్డను ఉంచి ఈ ఫొటో తీసి సోషల్ మీడియాలో పంచుకుందీ జంట. 1,616 సిరంజీలను వాడి వీర్య కణాలను గర్భంలోకి ప్రవేశపెట్టారని, తాను తల్లి కావాలన్న కోరిక తీరిందని ఆనందంగా చెప్పింది పాట్రీసియా. అదీ సంగతి.
Wed, Aug 22, 2018, 09:22 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View