చైనీస్ మొబైల్ మేకర్ హువావే చీప్ ట్రిక్స్.. ప్రొఫెషనల్ కెమెరాతో ఫొటోలు తీసి తమ ఫోన్‌తోనే తీసినట్టు కలరింగ్!
Advertisement
చైనీస్ మొబైల్ మేకర్ హువావే తాజా ప్రకటనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ సంస్థ ప్రకటనల చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. తాజాగా హువావే తన లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ నోవా3ని మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ సందర్భంగా విడుదల చేసిన ఓ యాడ్ ఇప్పుడు వివాదాస్పదమైంది.

సరా అనే నటి ఈ యాడ్‌లో నటించింది. ఇందులో నటీనటులు నోవా 3 ఫోన్‌తో ఫొటోలు తీసుకుంటూ కనిపిస్తారు. అద్భుతంగా వచ్చినట్టు కనిపించిన ఈ ఫొటోలను నిజానికి ప్రొఫెషనల్ కెమెరాతో చిత్రీకరించారని తేలింది. దీంతో హువావేపై నెటిజన్లు మండిపడుతున్నారు. తప్పుడు ప్రకటనలతో వినియోగదారులను మోసం చేస్తోందంటూ కంపెనీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ యాడ్‌లో నటించిన సరా తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫొటోలను పోస్టు చేసింది. అయితే, ఆమె నటించిన యాడ్‌లో ఉన్న ఫొటోలు ఇందులోనూ ఉండడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. యాడ్‌ కోసం ఫోన్‌తో సెల్ఫీలు తీసుకున్నట్టు వారు పోజివ్వగా దానిని ఫ్రొఫెనల్ కెమెరాతో చిత్రీకరిస్తున్న ఫొటో కూడా ఆమె పోస్టు చేసిన దాంట్లో ఉంది. దీనిని గుర్తించిన ఓ యూజర్ అసలు విషయాన్ని బయటపెట్టాడు. అది కాస్తా వైరల్ కావడంతో ఆ వెంటనే సైరా ఆ ఫొటోను డిలీట్ చేసింది. కాగా, ఈ వివాదంపై హువావే కూడా స్పందించింది. ఆ యాడ్‌లో తీసిన ఫొటోలను నోవా 3 స్మార్ట్‌ఫోన్‌తో తీసినట్టు తామెక్కడా చెప్పలేదని వివరణ ఇచ్చింది.
Wed, Aug 22, 2018, 08:34 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View