‘ఇదం జగత్’ టీజర్ ని విడుదల చేసిన వైఎస్ జగన్
Advertisement
Advertisement
సుమంత్ హీరోగా నటిస్తున్న ‘ఇదం జగత్’ సినిమా టీజర్ ను వైసీపీ అధినేత జగన్ ఆవిష్కరించారు. విశాఖపట్టణం జిల్లాలోని పాయకరావుపేట నియోజకవర్గం దార్లపూడి గ్రామంలోని పాదయాత్ర విడిది శిబిరంలో ‘ఇదం జగత్’  చిత్ర యూనిట్ సమక్షంలో ఈ టీజర్ ను జగన్ విడుదల చేశారు. అనంతరం, చిత్రయూనిట్ కు జగన్ అభినందనలు తెలిపారు.

‘ఇదంతా ఎందుకు షూట్ చేశావు?’ అనే ప్రశ్నకు, ‘సార్..ఇక్కడ మనిషి చావు న్యూసే.. మనిషి జ్ఞాపకాలూ న్యూసే..ప్రేమా న్యూసే..స్నేహం న్యూసే.. చెయ్యాలనుకుంటే ప్రపంచంలో ప్రతిదీ న్యూసే, అది ఎన్ క్యాష్ చేసుకోవడం తెలుసుకోండి..’ అనే సుమంత్ డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ఈ డైలాగ్స్ లో సుమంత్ కెమెరామన్ పాత్రలో నటించినట్టు తెలుస్తోంది. ఈ చిత్రం ద్వారా అంజు కురియన్ హీరోయిన్ గా పరిచయం కానుంది.
Tue, Aug 21, 2018, 08:39 PM
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View