ఇమ్రాన్ ఖాన్ ప్రమాణం చేసిన గంటల వ్యవధిలోనే.. వక్ర బుద్ధిని చాటుకున్న పాకిస్థాన్!
Advertisement
ప్రధాని మారినా పాకిస్థాన్ వక్ర బుద్ధి మారలేదు. ఇమ్రాన్ ఖాన్ ప్రమాణస్వీకారం చేసిన గంటల వ్యవధిలోనే పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ఉరీ సెక్టార్ లో పాక్ బలగాలు కాల్పులకు తెగబడ్డాయి. ఈ కాల్పుల్లో ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్టు ఇంతవరకు ఎలాంటి సమాచారం లేదు.

ప్రమాణస్వీకారం అనంతరం ప్రధాని హోదాలో నిన్న రాత్రి ఇమ్రాన్ తొలిసారి ప్రసంగించారు. పొరుగు దేశాలతో సత్సంబంధాల అంశాన్ని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. శాంతిని నెలకొల్పకుండా పాక్ పరిస్థితిని మనం మెరుగుపరుచుకోలేమని ఆయన అన్నారు. అయినప్పటికీ, పాక్ బలగాలు కాల్పులకు తెగబడటంతో... పాక్ పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశం లేదనే విషయం అర్థమవుతోంది.
Mon, Aug 20, 2018, 09:14 PM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View