భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు.. రికార్డు స్థాయికి చేరుకున్న సెన్సెక్స్
Advertisement
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు దూసుకుపోయాయి. అంతర్జాతీయ సానుకూలతలు తోడుకావడంతో పాటు... బ్యాంకింగ్, ఇతర రంగాల్లో కొనుగోళ్లకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపడంతో మార్కెట్లు జోరును కొనసాగించాయి. సెన్సెక్స్ జీవితకాల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 331 పాయింట్లు పెరిగి 38,277కు ఎగబాకింది. నిఫ్టీ 81 పాయింట్లు లాభపడి 11,552కు చేరుకుంది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హిందుస్థాన్ కన్ స్ట్రక్షన్ కంపెనీ (18.63%), వెల్స్ పన్ కార్ప్ (11.46%), పీటీసీ ఇండియా ఫైనాన్షియల్ సర్వీసెస్ (7.96%), జిందాల్ సా లిమిటెడ్ (7.22%), ఎల్ అండ్ టీ (6.74%).  

టాప్ లూజర్స్:
గ్రేట్ ఈస్టర్న్ షిప్పింగ్ కంపెనీ (-5.92%), ఫెడరల్ బ్యాంక్ (-5.62%), గ్రాఫైట్ ఇండియా (-4.95%), టీటీకే ప్రిస్టేజ్ (-4.22%), తమిళనాడు న్యూస్ ప్రింట్ అండ్ పేపర్స్ (-3.84%).  
Mon, Aug 20, 2018, 04:49 PM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View