వ్యాపారవేత్తను పెళ్లాడిన ద్రోణవల్లి హారిక.. ఆశీర్వదించిన ప్రముఖులు!
Advertisement
హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, సివిల్ ఇంజినీర్ కార్తీక్‌‌చంద్రతో భారత గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక వివాహం ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లోని ఎన్‌-కన్వెన్షన్ హాల్‌లో జరిగిన వీరి వివాహానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వేదపండితుల మంత్రోచ్చాణ మధ్య ఆదివారం రాత్రి 10:57 గంటలకు జరిగిన వీరి వివాహానికి తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్‌ మహిళా కమిషన్‌ అధ్యక్షురాలు నన్నపనేని రాజకుమారి సహా జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులు, నటులు, రాజకీయ నాయకులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.  
Mon, Aug 20, 2018, 07:29 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View