కేరళను ఆదుకోవాలంటూ పిలుపునిచ్చిన పోప్ ఫ్రాన్సిస్
Advertisement
జలదిగ్బంధంతో అపార నష్టాన్ని మూటగట్టుకున్న కేరళను ఆదుకోవడానికి అందరూ ముందుకు వస్తున్నారు. తాజాగా దెబ్బతిన్న కేరళను ఆదుకోవాలంటూ అంతర్జాతీయ సమాజానికి పోప్ ఫ్రాన్సిస్ పిలుపునిచ్చారు. వాటికన్ సిటీలో ఈరోజు జరిగిన ప్రార్థనల్లో పాల్గొన్న ఆయన ఈ మేరకు విన్నవించారు. వరద బీభత్సంలో ప్రాణాలు కోల్పోయిన వారి కోసం ప్రార్థనలు నిర్వహించాలని ప్రార్థనల్లో పాల్గొన్నవారిని ఫ్రాన్సిస్ కోరారు. కేరళ ప్రజలను ఆదుకునేందుకు క్యాథలిక్ చర్చి అన్ని చర్యలను తీసుకుంటోందని ఈ సందర్భంగా పోప్ తెలిపారు.
Sun, Aug 19, 2018, 07:54 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View