ఆసియా క్రీడల్లో ఫైనల్స్ కు దూసుకెళ్లిన భజరంగ్ పూనియా
Advertisement
జకర్తాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత రెజ్లర్ భజరంగ్ పూనియా సత్తా చాటాడు. పురుషుల 65 కేజీల విభాగంలో దూకుడును ప్రదర్శించిన పూనియా... మంగోలియాకు చెందిన బచులున్ పై 10-0 తేడాతో అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నాడు. అంతకు ముందు జరిగిన క్వార్టర్స్ లో కూడా పూనియా సత్తా చాటాడు. తజకిస్థాన్ కు చెందిన ఫైజీవ్ అబ్దుల్ ఖాసిమ్ పై 12-2 తేడాతో విజయం సాధించాడు.

మరోవైపు 97 కేజీల విభాగంలో ఖత్రీ మౌసమ్ ఉజ్బెకిస్థాన్ కు చెందిన ఇబ్రాగా మాగోపై 0-8 తేడాతో ఘోరంగా ఓడిపోయాడు. 86 కేజీల విభాగంలో పవన్ కుమార్ కూడా 0-11 తేడాతో ఇరాన్ కు చెందిన హసన్ పై ఓటమిపాలయ్యాడు.
Sun, Aug 19, 2018, 05:12 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View