వాజ్‌పేయి, వాడేకర్‌కు నివాళిగా చేతికి నల్లటి బ్యాండ్ ధరించిన టీమిండియా ఆటగాళ్లు.. వెక్కిరించిన విండీస్ కామెంటేటర్!
Advertisement
ఇటీవల మృతి చెందిన టీమిండియా మాజీ కెప్టెన్ అజిత్ వాడేకర్, మాజీ ప్రధాని వాజ్‌పేయికి టీమిండియా క్రికెటర్లు నివాళి అర్పించారు. ఇంగ్లండ్‌లో నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్‌బ్రిడ్జ్‌లో జరుగుతున్న మూడో టెస్టులో భారత ఆటగాళ్లు తొలి రోజు చేతికి నల్లని బ్యాండ్ ధరించారు. నల్లని బ్యాండ్ ధరించిన టీమిండియా కెప్టెన్ కోహ్లీ ఫొటోను బీసీసీఐ ట్వీట్ చేసింది. వాడేకర్, వాజ్‌పేయికి నివాళిగా ఆటగాళ్లు ఈ బ్యాండ్లను ధరించినట్టు పేర్కొంది.

టీవీ కామెంటరీ బాక్స్‌లో ఉన్న విండీస్ దిగ్గజం మాట్లాడుతూ.. భారత ఆటగాళ్లు చేతికి నల్లబ్యాండ్లు ధరించడాన్ని వెక్కిరింత ధోరణిలో చెప్పాడు. 'ఈ సిరీస్‌లో భారత్ 0-2తో వెనకబడినందుకు చేతికి నల్లబ్యాండ్లు ధరించలేదు.. దానికి కారణం ఏమిటంటే..' అంటూ  అప్పుడు అసలు విషయాన్ని చెప్పాడు. దీనిపై దుమారం చెలరేగింది. 
Sun, Aug 19, 2018, 07:24 AM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View