జియో మరో ఆఫర్.. గిగాఫైబర్ కు నెలకు 1100 జీబీ ఫ్రీ డేటా
Advertisement
టెలికాం రంగంలో ఎప్పుడూ సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్ గా ఉండే రిలయన్స్ జియో తన గిగాఫైబర్ సేవలను అందించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. కస్టమర్లను ఆకట్టుకోటానికి  బంపర్ ఆఫర్ ను కూడా అందించనున్నట్టు తెలుస్తోంది. ఒక నెలకు 1100 జీబీ డేటా ఉచితంగా అందించే ఆలోచనలో వుంది. అలా మూడు నెలలు ఉచిత డేటా ఇవ్వనుంది.
 3 నెలల కాలవ్యవధికి గాను ప్రివ్యూ ఆఫర్ కింద 100 ఎంబీపీఎస్ స్పీడ్‌తో నెలకు గరిష్టంగా 100 జీబీ వరకు డేటాను ఉచితంగా ఇవ్వనున్నట్లు సమాచారం.

ఇక 100 జీబీ డేటా అయిపోయినా ఒక్కోటి 40 జీబీ విలువ గల 25 టాపప్‌లను కూడా 3 నెలలలో ఉచితంగా వేసుకునేలా జియో తన గిగాఫైబర్ సేవల ప్రివ్యూ ఆఫర్‌లో ఇవ్వనుంది. అలా  అయితే వినియోగదారులకు ఒక నెలకు 1100 జీబీ డేటా ఉచితంగా వస్తుంది. అలా 3 నెలల పాటు నెలకు 1.1 టీబీ డేటాను వాడుకోవచ్చు.

 ఇప్పటికే చాలా మంది జియో గిగాఫైబర్ సేవలకు గాను రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. అధిక సంఖ్యలో రిజిస్ట్రేషన్లు వచ్చిన మెట్రో సిటీల్లో ముందుగా జియో గిగాఫైబర్ సేవలను ప్రారంభిస్తారు. అయితే ఈ  ప్రివ్యూ ఆఫర్‌ను జియో తన గిగాఫైబర్ కస్టమర్లకు అందిస్తుందా, లేదా అన్న అంశంపై ఇంకా స్పష్టత రాలేదు.  
Sat, Aug 18, 2018, 09:42 PM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View