క్రికెటర్ గౌతమ్ గంభీర్ రాజకీయ అరంగేట్రం?
Advertisement
దేశ రాజకీయాల్లో మరో క్రికెటర్ రాబోతున్నాడు... వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పశ్చిమ ఢిల్లీ నుండి పోటీకి దిగడానికి గౌతమ్ గంభీర్ రెడీ అవుతున్నాడు.  ప్రస్తుతం ఈ వార్త రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వచ్చే ఎన్నికల్లో గెలుపుకు అవకాశం వున్న కొత్త వారికి టికెట్లు ఇచ్చి, వీలైనన్ని స్థానాల్లో గెలవాలనే యోచనలో తమ పార్టీ వున్నట్టు ఢిల్లీకి చెందిన బీజేపీ నాయకుడు ఒకరు తెలిపారు. ఈ క్రమంలో క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌తో పాటు బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ను బరిలోకి దించాలని పార్టీ వర్గాలు ఆలోచిస్తున్నట్టు ఆయన చెప్పారు. ఢిల్లీకి చెందిన గంభీర్ భారత్‌ తరఫున పలు వన్డేలలోనూ, టెస్టులలోను ఆడాడు. గత ఏడాది రాజ్‌కోట్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టులో చివరి సారిగా ఆడాడు.
Sat, Aug 18, 2018, 09:24 PM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View