ప్రమాణస్వీకారంలో అర్థాన్నే మార్చేసిన ఇమ్రాన్ ఖాన్
Advertisement
పాకిస్థాన్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ ఈ రోజు ప్రమాణస్వీకారం చేశారు. పాక్ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్ శుద్ధమైన ఉర్దూ పదాలు వాడుతూ ఆయన చేత ప్రమాణం చేయించారు. సంక్లిష్టంగా ఉన్న ఆ ఉర్దూ పదాలను ఇమ్రాన్ ఖాన్ సరిగా అర్థం చేసుకోలేకపోయారు. ఒక పదాన్ని పలకడానికి ఆయన ఎంతో కష్టపడ్డారు. ఈ సమయంలో ఆయన ముఖకవళికలు కూడా కొంచెం మారాయి. అక్కడే ఉన్న తన భార్య బుష్రా మనేకా ఆ పరిణామాన్ని గమనిస్తుండటంతో... ఆయన మరింత ఇబ్బందికి గురయ్యారు.

ముమ్నూన్ హుస్సేన్ 'రోజ్-ఏ-ఖియామత్' (తీర్పు దినము) అని చెప్పినప్పుడు... ఇమ్రాన్ ఖాన్ 'రోజ్-ఏ-ఖియాదత్' (నాయకత్వ దినము) అని పలికారు. దీంతో ప్రమాణస్వీకారం అర్థమే మారిపోయింది. ఈ సందర్భంగా ఇమ్రాన్ చేసిన తప్పును అధ్యక్షుడు సరిదిద్దారు. ఇమ్రాన్ చిరునవ్వు నవ్వి, సారీ చెప్పారు. అనంతరం ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని ముగించారు.  
Sat, Aug 18, 2018, 04:43 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View