నానో ఉపగ్రహాలపై మూడేళ్ల శిక్షణ ఇవ్వనున్న ఇస్రో
Advertisement
అంతరిక్ష విజ్ఞానాన్ని అందించేందుకు ఇస్రో నానో (చిన్న) ఉపగ్రహాలపై మూడేళ్ళ శిక్షణ ఇవ్వనుంది. అంతరిక్ష విజ్ఞానానికి సంబంధించి ఐక్యరాజ్యసమితి కీలక సదస్సు నిర్వహించి 50 ఏళ్ళు దాటిన నేపథ్యంలో ‘ఉన్నతి’ పేరిట బెంగళూరులోని యు.ఆర్‌.రావు ఉపగ్రహ కేంద్రంలో ఈ శిక్షణ ప్రారంభిస్తామని ఇస్రో ఛైర్మన్ డా.శివన్ తెలిపారు.

అంతరిక్షంలోకి చిన్న ఉపగ్రహాలను ప్రయోగించేందుకు వీలుగా, అతి చిన్న నానో ఉపగ్రహాల జోడింపు తదితర అంశాలపై మూడేళ్ల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఇస్రో ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో విదేశీ అభ్యర్థులకూ అవకాశం కల్పిస్తామని ఇస్రో ఛైర్మన్‌ డాక్టర్‌ కె.శివన్‌ తెలిపారు.
Sat, Aug 18, 2018, 04:22 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View