విశ్రమించిన శాంతిదూత.. కొఫీ అన్నన్ అస్తమయం!
Advertisement
ఐక్యరాజ్యసమితి మాజీ ప్రధాన కార్యదర్శి కొఫీ అన్నన్(80) ఈ రోజు తుదిశ్వాస విడిచారు. గత కొద్దికాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. అన్నన్ ఐక్యరాజ్యసమితికి 1997-2006 మధ్యకాలంలో ఏడో ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ప్రపంచశాంతి కోసం చేసిన కృషికి గుర్తింపుగా అన్నన్ కు 2001లో నోబెల్ శాంతి బహుమతి లభించింది.

ఆఫ్రికా దేశమైన ఘనాలోని కుమసీలో 1938, ఏప్రిల్ 8న అన్నన్ జన్మించారు. ఆయనకు భార్య నానే, ముగ్గురు పిల్లలు ఉన్నారు. అన్నన్ సిరియాలోనూ ఐక్యరాజ్యసమితి ప్రత్యేక దూతగా పనిచేశారు. సిరియాలో అంతర్యుద్ధం ముగిసేందుకు వీలుగా ప్రభుత్వం, తిరుగుబాటుదారుల మధ్య ఆయన చర్చలు జరిపారు. సమాజంలో పేదలు, బలహీనవర్గాలకు సాయం అందించేందుకు ఆయన తన పేరుతో కొఫీ అన్నన్ ఫౌండేషన్ ను ప్రారంభించారు. అన్నన్ మృతిపై ఐక్యరాజ్యసమితి విచారం వ్యక్తం చేసింది. 
Sat, Aug 18, 2018, 03:38 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View