చైనా కోసం రహస్య ప్రాజెక్ట్ పై గూగుల్ ఉద్యోగుల నిరసన
Advertisement
సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్‌ చైనా కోసం ఓ రహస్య ప్రాజక్టును చేబడుతున్నట్టు ఇటీవల విస్తృతంగా ప్రచారం జరిగింది. ఈ వ్యవహారంపై ఆ సంస్థలోని వందలాది ఉద్యోగులు తీవ్రంగా స్పందించారు. యాజమాన్యం తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ ఓ లేఖను రాశారు. దీనిపై పనిచేసేందుకు అభ్యంతరాలను వ్యక్తం చేశారు. ఈ లేఖపై సుమారు 1400 మంది ఉద్యోగులు సంతకం చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో సంస్థ మరింత పారదర్శకంగా వ్యవహరించాలని, రహస్య ప్రాజెక్ట్ పై వివరణ ఇవ్వాలని, అసలు తాము దేనిని అభివృద్ధి చేస్తున్నామో తెలుసుకోవాల్సిన అవసరం తమకు ఉందని ఉద్యోగులు ఆ లేఖలో పేర్కొన్నారు.
Sat, Aug 18, 2018, 04:12 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View