పాకిస్థాన్ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన ఇమ్రాన్ ఖాన్.. సిద్ధూకి తొలి వరుసలో స్థానం!
Advertisement
పాకిస్థాన్ లో నవశకం ప్రారంభమైంది. తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ అధినేత, క్రికెట్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ పాకిస్థాన్ ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. పాకిస్థాన్ ప్రెసిడెంట్ హౌస్ లో ఈ కార్యక్రమం నిరాడంబరంగా జరిగింది. ఇమ్రాన్ ఖాన్ చేత పాక్ అధ్యక్షుడు మామ్మూస్ హుస్సేన్ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి దిగ్గజ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూ హాజరయ్యారు. తన స్నేహితుడైన సిద్ధూను తొలి వరుసలోనే కూర్చోబెట్టి, గౌరవించారు ఇమ్రాన్ ఖాన్. ప్రమాణస్వీకారం సమయంలో సిద్ధూ ఎంతో ఆనందంగా గడిపారు. ప్రమాణస్వీకారం పూర్తయిన వెంటనే హాల్ మొత్తం చప్పట్లతో మారుమోగింది.
Sat, Aug 18, 2018, 11:02 AM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View