ఇంగ్లాండ్ తో టెస్ట్ సీరీస్ కు భువి దూరం!
Advertisement
భారత క్రికెట్ అభిమానులకు ఇది నిరాశ కలిగించే వార్త. ఇంగ్లాండ్ తో జరిగే మూడో టెస్ట్ కు భువనేశ్వర్ కుమార్ దూరం కానున్నాడని తెలుస్తోంది. అంతేకాదు, చివరి రెండు టెస్టులకు కూడా భువి‌ ఆడటం అనుమానమే అని సమాచారం. మూడో టెస్టులో బుమ్రా ఆడనున్నాడన్న వార్తతో ఆనందంలో వున్న అభిమానులు ఇప్పుడీ వార్తను విని అప్సెట్ అవుతున్నారు. వెన్నునొప్పి కారణంగా బాధపడుతున్న భువనేశ్వర్ పూర్తిగా కోలుకోకపోవటంతో అతను ఇంగ్లాండ్‌తో పూర్తి టెస్టు సిరీస్‌కు దూరం కానున్నట్లు తెలుస్తుంది.

నాటింగ్‌ హామ్‌లోని ట్రెంట్‌బ్రిడ్జ్‌ వేదికగా శనివారం నుంచి  మూడో టెస్ట్ మ్యాచ్‌ జరగనుంది. భారత్‌-ఇంగ్లాండ్‌ మధ్య జరిగిన తొలి రెండు టెస్టుల్లో భారత్‌ ఓటమి పాలైంది. సిరీస్‌లో పోటీకి నిలవాలంటే భారత్‌ మూడో టెస్టులో తప్పక గెలవాలి. లేదంటే మరో రెండు మ్యాచ్‌లు ఉండగానే సిరీస్‌ ఇంగ్లాండ్‌ కైవసం అయిపోతుంది. ఈ టెస్ట్ మ్యాచ్ కీలకం కావటం, భువి ఆడకపోవటంతో క్రికెట్ అభిమానుల్లో టెన్షన్ నెలకొంది.  
Fri, Aug 17, 2018, 04:09 PM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View