నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
Advertisement
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాలను మూటగట్టుకున్నాయి. అంతర్జాతీయంగా ఎలాంటి సానుకూలతలు లేకపోవడం, డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ మరింతగా పడిపోవడం (రూ. 70.32) తదితర కారణాలతో మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 188 పాయింట్లు పతనమై 37,663కు పడిపోయింది. నిఫ్టీ 50 పాయింట్లు కోల్పోయి 11,385కు దిగజారింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హెచ్డీఐఎల్ (18.27%), తమిళనాడు న్యూస్ ప్రింట్ అండ్ పేపర్స్ (12.02%), వక్రాంగీ (10.00%), సొనాటా సాఫ్ట్ వేర్ (8.90%), హిందుస్థాన్ కన్ స్ట్రక్షన్ కంపెనీ (6.15%).

టాప్ లూజర్స్:
రిలయన్స్ కమ్యూనికేషన్స్ (-10.39%), జైన్ ఇరిగేషన్ (-8.83%), ఎస్ఆర్ఈఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (-5.39%), దీపక్ ఫర్టిలైజర్స్ (-5.14%), రిలయన్స్ నేవల్ అండ్ ఇంజినీరింగ్ (-4.98%).  
Thu, Aug 16, 2018, 04:01 PM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View