పాకిస్తాన్ స్పీకర్ గా పీటీఐ అభ్యర్థి అసద్ ఖైజర్ ఎన్నిక!
Advertisement
పాకిస్తాన్ పార్లమెంట్‌ (జనరల్ అసెంబ్లీ)కు ఇటీవల ఎన్నికైన సభ్యులు కొత్త స్పీకర్‌ను ఎన్నుకున్నారు. ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయబోయే ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్‌ (పీటీఐ)కి చెందిన అసద్ ఖైజర్‌ను పార్లమెంట్ దిగువ సభకు స్పీకర్‌గా ఎన్నుకున్నారు . ఖైజర్ తన ప్రత్యర్థి, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీకి చెందిన చెందిన సయ్యద్ ఖుర్షీద్ షాపై విజయం సాధించారు. సీక్రెట్ బ్యాలెట్ విధానంలో జరిగిన ఈ ఎన్నికలో కైజర్‌కు 176 ఓట్లు రాగా, అతని ప్రత్యర్థి షాకు 146 ఓట్లు వచ్చాయి, ఎనిమిది ఓట్లు చెల్లలేదు.

 ఇప్పటివరకు స్పీకర్‌గా ఉండి నిష్క్రమిస్తున్న ఆయజ్ సాదిక్ పాకిస్థాన్‌ జాతీయ అసెంబ్లీ సభాపతిగా ఖైజర్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఖైజర్ విపక్ష నేతలకు కరచాలనం చేశారు. కొత్తగా ఎన్నికైన స్పీకర్ ప్రధాని ఎన్నికను పర్యవేక్షిస్తారు. దీంతో అధికార మార్పిడి తంతు లాంఛనంగా ప్రారంభమైంది. ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రధానిగా శనివారం ప్రమాణం చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. స్పీకర్ గా బాధ్యతలు చేపట్టిన ఖైజర్ త్వరలో ప్రధానిగా బాధ్యత చేపట్టనున్న ఇమ్రాన్ ఖాన్ స్నేహితుడు కావటం  విశేషం .
Thu, Aug 16, 2018, 02:34 PM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View