న్యూడ్ గా పోజులిచ్చి, ఆన్ లైన్ లో విడుదల చేసిన మోడల్ కు జైలు శిక్ష!
Advertisement
దక్షిణ కొరియాలో తన నగ్న చిత్రాలను విడుదల చేసిన ఓ మహిళా మోడల్ కు న్యాయస్థానం తిక్కకుదిర్చింది. న్యూడ్ ఫొటో సెషన్ కు వెళ్లి, కొందరు పురుషులతో కలసి ఫొటోలు దిగి, వాటిని ఆన్ లైన్ లో విడుదల చేయగా, పోలీసులు కేసు పెట్టి ఆమెను అరెస్ట్ చేశారు. కేసును విచారించిన న్యాయస్థానం పదినెలల జైలుశిక్షతో పాటు లైంగిక నేరాలు, వాటికి సంబంధించిన శిక్షలపై 40 గంటల పాటు ఆమెకు కౌన్సెలింగ్ ఇవ్వాలని తీర్పిచ్చింది. కాగా, 2010లో దక్షిణకొరియాలో ఈ తరహా కేసులు 1100 నమోదు కాగా, గత సంవత్సరం వీటి సంఖ్య 6,500కు పెరగడం గమనార్హం.
Thu, Aug 16, 2018, 12:42 PM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View